తెలుగు తల్లి ఫౌండేషన్ కి స్వాగతం

"మానవసేవ చెయ్యాలంటే ఉండాల్సింది మంచి మనసొక్కటే" అని నమ్మే వ్యక్తి బండారు దానయ్య. సినిమా పాటల రచయితగా, కవిగా పేరు ప్రఖ్యాతులు గడిస్తున్న బండారు దానయ్య మేలైన సమాజం కోసం తనవంతు కృషి చేయాలనే ఆలోచనతో స్థాపించిన సంస్థ "తెలుగు తల్లి ఫౌండేషన్".

Welcome to Telugu Talli Foundation

"All you need is a good heart to serve the mankind," says Bandaru Danayya. An acclaimed writer and lyricist, Mr Danayya, also known as Bandaru Danayya Kavi, has established "Telugu Talli Foundation" with idea of creating a better society for the future India.

మానవహితం… మానవహితం… – బండారు దానయ్య కవి

………………………………………………………

ఆస్తికుడు దేవుడా… అని అంటే
నాస్తికుడు దేవుడా..? అని అంటాడు
ఏది ఏమైనా దెవుడా అనే మాట మాత్రం నిజం.
ఈ నిజంలోనే నిజం లాంటి అబద్ధాలు..
నా దేవుడే నిజమైన దేవుడంటే,
నా దేవుడే నిజమైన దేవుడంటూ!
ఆ నిజమైన దేవుడు చెప్పిన నిజాలు మాత్రం నిత్యము వినదగినవే.
………………………………………………………

స్వార్ధమును త్యాజింపక నానా విధములైన భోగవాంఛలతో కూరుకొని పొయిన వారి ఙ్ణానము హరింపబడును
ఏవ అను అవ్యయము ఇచట సర్వ గుణముల సముచ్చేయము అని ఎరుంగుమూ


– శ్రీమద్భగవద్గీత

వ్యక్తిగత లాభంకోసం సంపద కూడబెట్టకూడదు
సంపద అందరకి సమానంగా అందాలి
దానం చెయడం తప్పనిసరి
బీదవారిని గురించి పట్టించుకోవాలి


– ఇస్లామ్ (సూరా 51:19, 70:24)

ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మును ఎవడు భ్రమపెట్టెను సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా

– క్రైస్తవం

1) నామ్ జపో – భగవన్నామాన్ని జపించడం అనే యోగవిఙ్ణానం
2) కీర్త్ కరో – నిస్వార్ధము, నిజాయితీలతో కూడిన శారీరక శ్రమ
3) వాంద్ చాకో – నీవు సంపాదించినదాన్ని ఇతరులతో పంచుకోవడం


– గురునానక్

మనలో దుఃఖం మాయమవ్వాలంటే మానవ సేవ ఒక్కటే సరైన మందు

– గౌతమ బుద్దుడు

మన దేవుడైన, మన మతమైన కోరుకునేదొక్కటే..
సర్వసృష్ఠిహితం. అందులో ప్రాణులన్నీను భాగమే.
ప్రాణులన్నిటి మీద పైచేయి సాధించిన మానవులం,
మానవహితం కోరుకోవాలి.
అలా కోరలేని మనం, ప్రకృతిని, ప్రాణకోటిని పట్టి పీడించినవాళ్ళమే అవుతాం.





– బండారు దానయ్య కవి


bandaru danaiah kaviki naa abhinandanalu – Dr. C nare

Dr. C Narayana Reddy Garu has extended his blessings on Bandaru Danaiah Kavi.

Read more »

ఆలోచనలు ప్రేరేపించే దానయ్య గారి రచనలు-వేటూరి

కఠిన సత్యాల కటకటాల్లోంచి బంధీకృతమైన జీవితమనే చెరసాలను దర్శిస్తున్నప్పుడు అస్వతంత్రతా వేదన ఆవేదనగా మారి కవితా రూపు సంతరించుకుంటుందనటానికి శ్రీ బండారు దానయ్య గారి ఈ కావ్యమొక్కటే చాలు.

ఇందులో ఆశావాదాలు, ఆకాశసౌధాలు, భావ ప్రణాళికలు, కవితా గణితాలు ఎన్నో ఉన్నాయి. సామాన్య మానవుడి నిత్య జీవితానికి నిలువుటద్దం ఈ కావ్యం. అమ్మకి అష్టోత్తరము ఈ కవితలలో చూడవచ్చు. అదే పేగు అనే ఖండిక.

అలోచనా ప్రేరకమైన శ్రీ దానయ్య గారి నవకవితకు నా స్వాగతం.

Read more »

praja kavi bandaru danaiah kavi – Dr. Maestro gajal srinivas

Bandaru Danaiah is also complemented by Mastro Dr. Gajal Sreenivas Garu as well.

Read more »

ప్రేరణ దైవానిదైనా సాధించును నరుడే-కే.వి.నరసింహాచార్యులు

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు

“శాస్త్రజ్ఞానము కానీ పూర్వకవి రచనా పఠనమునకు గానీ వనరులు అవకాశాలు లేని ప్రదేశంలో ఉంటూ తన పాఠ్యపుస్తకాలలోని మహనీయుల రచనలనే కరదీపిక చేసుకుని పట్టినపట్టు వీడక ప్రయత్నించినవాడు, సాధించనవాడు బండారు దానయ్య.”

సినిమాలకు పాటలు రాయాలనే కోరిక ఇతని లక్ష్యం. దాన్ని నెరవేర్చుకున్నాడు.

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే సూక్తికి మేలైన ఉదాహరణగా నిలిచే బండారు దానయ్య గురించి అతని చిన్ననాటి గురువు కేవి.నరసింహాచార్యుల మాటల్లోనే చదవండి.

Read more »

దేశ ప్రేమి బండారు దానయ్య-సుద్దాల అశోక్ తేజ

ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ మాటల్లో బండారు దానయ్యను ఒక దేశ ప్రేమిగా పేర్కొన్నారు. “విపరీతంగా తన ప్రజల్ని-తన తెలుగుతనాన్ని, తన భాషని, రాష్ట్రాన్ని, దేశాన్ని, దేశీయతను ప్రేమించే కవి” గా బండారు దానయ్యని ఆయన వర్ణించారు.

సినీ గేయ రచయితగానే కాకుండా కవిగా “సిగ్గు-లజ్జ” శీర్షిక న బండారు దానయ్య వెలువరించిన కవితా సంపుటికి ముందుమాట రాస్తూ తనతో “సమకాలీకుడిగా ఉంటూ సమజాన్ని బండారు ఇలా సమారాధాన చేస్తున్నందుకు గర్వపడుతున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

బండారు దానయ్య గురించి, ఆయన కవితల గురించి సుద్దాల గారి పూర్తి వ్యాసం కింద చదవండి.
Read more »

తెలుగు తల్లి ఫౌండేషన్ – లక్ష్యాలు

ఎంతటి వారికైనా- ఏదో ఓ సమయాన ఏదో ఓ సహాయం అవసరం కావొచ్చు.

అది-సహజమైనదే కావొచ్చు, కాకపోవచ్చు-కానీ సహాయం.

అది గొడుగు లాంటి సహాయం కావొచ్చు, పిడుగులాంటి ఆపదా రావొచ్చు

ఈ ఆలోచనల సమాహారమే, తెలుగు తల్లి ఫౌండేషన్

వస్తాము-వుంటాము-పోతాము; మనము-మన కుటుంబం.

మరి మన చుట్టూ ఓ ప్రపంచం వుంది కదా!
ఈ ప్రపంచంలో ప్రమిదము కాలేకపోయినా
Read more »